సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గాన్ని సుందరీకరణ చేయడానికి అన్ని సంఘాలు ముందుకు వస్తున్నాయని, భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, శనివారం శ్రీఅన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు విగ్రహ దాత తమిరి శరత్ సహకారంతో సుమారు రూ 2 లక్షలతో భీమవరం ఓవర్ బ్రిడ్జి వద్ద “స్వాగతం – సుస్వాగతం పలికే స్త్రీ మూర్తుల శిల్ప కళ” విగ్రహాలను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. దాత తరిమి శరత్ మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతున్నామని, మరింత సుందరీకరణకు రానున్న రోజుల్లో మరింత సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కోళ్ల నాగేశ్వర్రావు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, విజ్జురోతి రాఘవులు, ట్రస్ట్ కార్యదర్శి చలపాక కృష్ణ భవానీ, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
