సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం.. భీమవరం పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్రజా ఆరోగ్యకరంగా ఉంచేందుకు సహకరించాలని మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్, ఎస్.కృష్ణమోహన్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసారు..’ క్లీన్ ఆంధ్రప్రదేశ్’ లో భాగంగా స్థానిక 20వ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ , పరిశుభ్రత విషయంలో ప్రజలను చైతన్య పరిచేందుకు ఈనెల 12 నుంచి 18 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను పట్టణంలో నిర్వహిస్తున్నామన్నారు. చెత్తను తీసుకొనివెళ్లేందుకు మున్సిపల్ వెహికల్ ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు చెత్తను. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరుచేసి మూడు రంగుల బిన్స్‌లో వేసి వెహికల్‌కు అందించాలని కోరారు.
