సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణాన్ని సుందరికారణ పట్టణం గా తీర్చిదిద్దేల చర్యలు తీసుకోవాలని భీమవరం మునిసిపల్ కమీషనర్ అన్నారు. నేడు, మంగళవారం స్థానిక పురపాలక సంఘం నందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంజినీరింగ్ సిబ్బందితో పాటు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు మరియు ఎమినిటీ సెక్రెటరీలు పాల్గొన్నారు. పట్టణాన్ని శుభ్రత తో పాటు అందమైన పట్టణం గా తీర్చిదిద్దేల చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని అన్ని వార్డ్ లకు సంబందించిన పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలని మరియు వర్క్ ఆర్డర్ లు ఇఛ్చి పనులు ప్రారంభం కానివి వెంటనే మొదలు పెట్టాలని, అదేవిధముగా Property Tax, Water Tax బకాయిలు వసూలు చేయడం మరియు ట్యాక్స్ “Enhancement” చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ME పి.త్రినాథ్ రావు, ACP పి.గౌరు, Dyee కె. అప్పలరాజు, Dyee శ్రీనివాస్,రెహమన్, AE లు మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు..
