సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పరిధిలోని ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు చెల్లింపు దారులు ది 21.03.2026 రంజాన్ పర్వదినము మరియు ది.22.03.2026 ఆదివారం రోజున కూడా పురపాలకసంఘకార్యాలయములో పన్నులు చెల్లించుటకు ప్రత్యేక కౌంటర్లు పనిచేయునని తెలియజేయడమైనది. రాష్ట్ర ప్రభుత్వము వారి ఉత్తర్వులు GO.MS.NO.58, ది.16.03.2026 ప్రకారం ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నుల వడ్డీ పై 50 శాతము రాయితీ కూడా కల్పించారని, కావున పన్ను చెల్లింపుదారులందరు సదరు సౌకర్యమును వినియోగించుకొని వడ్డీ మాఫీ పొంది గడువు లోపు ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మరియు కుళాయి ఛార్జీలు చెల్లించవలసినదిగా స్థానిక మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. . సదరు ప్రత్యేక పన్ను చెల్లింపు కౌంటర్లు ప్రతి రోజు ఉదయం 8.00 గం. ల నుండి రాత్రి 8.00 గం, ల వరకు తెరిచి యుంచబడునని తెలియ జేశారు
