సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అడ్వైజర్ సి. శ్రీనివాసన్, వెల్లూరి వారి ద్వారా భీమవరం పురపాలక సంఘ కమిషనర్, ఎమ్. శ్యామల వారు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఎ. శ్రీ విద్య ఆధ్వర్యంలో భీమవరం పురపాలక సంఘ ఆఫీస్ నందు ప్రజా ఆరోగ్య మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది వారికి శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్ధాల నిర్వహణ మరియు మురికి వ్యర్ధాల నిర్వహణ పద్ధతుల పై సిబ్బందికి అవగాహన కల్పించారు రానున్న ఆరు నెలల కాలంలో భీమవరం పురపాలక సంఘ 100% వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కు చేరకుండా సమీప ప్రాంతాలలోనే శాస్త్రీయ పద్ధతులలో కంపోస్టింగ్ చేయు విధానాలను మరియు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలలో గ్రీన్ సాలిడ్ వేస్ట్ మైండ్ విధానాలను చర్చించారు . అలాగే ఈ సమావేశానికి పూర్వం వారు నేరుగా భీమవరం పట్టణ చెత్త వేస్తున్న ప్రదేశానికిఅక్కడ జరుగుతున్న డంపింగ్ విధానాలను పరిశీలించారు డంపింగ్ యార్డ్ లోని వ్యర్థాలను అక్కడే ప్రాసెస్ చేయడానికి అనువైన పద్ధతులను పరిశీలించారు ఈ సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారు, మున్సిపల్ ఇంజనీర్ వారు మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వాడు శానిటేషన్ సెక్రటరీలు మరియు వాటి ఏమినిటీస్ సెక్రటరీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *