సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉభయ గోదావరి జిల్లాలలో రేపటి నుండి సంక్రాంతి పర్వదినాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకలలో తరతరాలుగా సాంప్రదాయ కోడిపందాలకు ఉండే ప్రాధాన్యం అందరికి తెలిసిందే.. ఇక భీమవరం అయితే సంక్రాంతి అతిధులకు ఆతిధ్యాలతో పాటు, కోడిపందాల బ్రాండ్ అంబాసిడర్ గా ప్రసిద్ధి చెందింది. ఒక ప్రక్క పోలీస్ అధికారుల ఆంక్షలు, కత్తులు కట్టేవారిపై బెండోవర్ కేసులు, కోడిపందాలు, జూదాలు ఆడవద్దని ప్రజల హితవు కోరిపోలీస్ శాఖ నిర్వహిస్తున్న చైతన్య సదస్సులు, ర్యాలీలు ప్రభావం కొంత ఉన్నప్పటికీ .. రేపటి నుండి కోడి పందాలకు భీమవరం మండలం, ఉండి పరిసరప్రాంతాలలో,కోనసీమలో బరులు సిద్ధం చేస్తున్నారని వార్త సమాచారం. ఇక సంక్రాంతి బరిలో నిలిచే ప్రత్యేకమైన కోడి పుంజుల అమ్మకాలు కూడా మొదలయ్యాయి. ధరలు కూడా పుంజు రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష కు పైగా కూడా ధర పలుకుతున్నాయి. బరిలో దిగితే ప్రాణాలు పోయేవరకు తలపడే రకాల్లో సేతువ జాతి పుంజు ముందుంటుంది. దీని ధర రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుందట.. తర్వాత స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్టమారు జాతులు ఉన్నాయి.ఎక్కువగా దొరికే, పర్ల రూ. 50 వేలు, నెమలి రూ. 50 వేల నుంచి రూ.60 వేలు, కాకి డేగ పర్ల రూ.15 వేల నుంచి రూ.30 వేలు, ఎర్రకెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకి డేగ రూ.25వేల నుంచి రూ.40 వేలు ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు రసంగి, కెక్కరి, పింగళ రకాలు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరలకు పందెంరాయుళ్లు కొనుగోలు చేస్తున్నారు. గ్రామాలలో పుంజుల పెంపకం దారులకు ఇదో మంచి ఆదాయమార్గంగా మారిందనే చెప్పాలి.. up file photo
