సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ ఉమెన్స్ కాంపస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పోలీస్ గౌరవవందనం స్వీకరించారు. సభ వేదికపై కలెక్టర్ తో పాటు జిల్లా పోలీస్ అధికారులు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు అస్సినులయ్యారు. పోలీస్ కవాత్తు , బ్యాండ్ వాయిద్యాలతో గౌరవ శాల్యూట్ లతో అమరులయిన పోలీస్ వీరులకు ఘన నివాళ్లు అర్పించారు. జిల్లా కలెక్టర్, మరియు ఇతర డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి పోలీస్అధికారులు ప్రసంగిస్తూ .. దేశ ప్రజల ధన మాన సంరక్షణ లో పోలీస్ సేవలు ఎంతో అమూల్యమైనవని, దేశభక్తి తో పాటు ప్రజా రక్షణ కోసం ఒకసారి ప్రాణార్పణ చెయ్యవలసిన అవసరం ఉంటుందని, ఇప్పటికే ఎందరో పోలీసులుదేశ సేవలో, విధి నిర్వహణలో, కరోనా విజృంభణ సమయం లో ప్రజలకు సేవలు అందించడానికి ప్రాణత్యాగాలు చేసారని వారి త్యాగనిరతికి జోహార్లు అన్నారు.గత 2ఏళ్లుగా భీమవరంకు చెందిన , తాడేపల్లి గూడెం కు చెందిన పలువురు పోలీస్లు, అధికారులు, హోమ్ గార్డులు విధి నిర్వహణలో మృతి చెందటం బాధాకరం అని వారికీ పేరుపేరున ఘన నివాళ్లను అర్పిస్తున్నామన్నారు. ఇక పోలీస్ అమరవీరుల స్మారక స్థూపానికి జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు, విష్ణు కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు తదితరులు పుష్ప గుచ్చాలతో ఘన నివాళ్లు ,శాల్యూట్అర్పించారు.
