సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లో ఉన్న పాత బస్సు స్టాండ్ లో( bhimavaram old bus stand ) ప్రయాణికులు బస్సు లకోసం నిరీక్షించడానికి.. పోతుమర్రు గ్రామానికి చెందిన చేకూరి రామభద్రరాజు దంపతుల దాతృత్వంతో ఆధునిక వసతులతో చేపట్టిన నిర్మాణం పూర్తీ చేసుకొని నేడు, సోమవారం కూటమి నేతల సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. ఇక ఫై భీమవరం 2 టౌన్ మీదుగా ప్రయాణించే బస్సులతో పాటు భీమవరం మండలం, సముద్ర తీరా ప్రాంతాల గ్రామాల వైపు వెళ్లే ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సు కోసం ఇక్కడ నీరిక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ జిల్లా అడ్జక్షుడు, రామరాజు, మాజీ ఎమ్మెల్సీ, మంతెన సత్యనారాయణ రాజు జనసేన ఉమ్మడి జిల్లా అడ్జక్షుడు, చినబాబు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆనందా విశ్వనాధ రాజు లతో పాటు జిల్లా కలెక్టర్ నాగరాణి ఇతర అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
