సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు పురపాలక సంఘ కమీషనర్ ఎమ్. శ్యామల మరియు అసిస్టెంట్ కమీషనర్ మరియు మునిసిపల్ ఇంజనీర్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని పారిశుద్యం పై రివ్యూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ లో కమీషనర్ వారు రానున్న వర్షాకాలం లోపు పట్టణంలోని ప్రధాన డ్రైయిన్లను పూడిక తీయించడానికి తగు ప్రణాళిక తో సిద్ధం కావాలి అని సిబ్బందికి అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది. మురుగు నీరు వేగంగా వెళ్లేందుకు ప్రధాన డ్రైనేజీ లను పూడిక తీయడానికి కాంట్రాక్టు లు పిలవాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరియు ప్రధాన డ్రైన్ లను కలుపుతూ ఉండే మధ్యస్థ డ్రైన్ లను పూడిక తీయడానికి పురపాలక సంఘం లో అందుబాటులో ఉన్న యంత్రాలను ఉపయోగించాలి అని సూచనలు చేయడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *