సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు పురపాలక సంఘ జిల్లా వ్యవసాయ అధికారి వారి ఆధ్వర్యంలో కమీషనర్ ఎమ్. శ్యామల, అసిస్టెంట్ కమీషనర్ మరియు మునిసిపల్ ఇంజనీర్ వారి అధ్యక్షతన పట్టణంలోని పారిశుద్యం పై రివ్యూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ కార్యక్రమములో జిల్లా వ్యవసాయ అధికారి వారు రానున్న వర్షాకాలంలోపు పట్టణంలోని ప్రధాన డ్రైయిన్లను పూడిక తీయించడానికి తగు ప్రణాళికతో సిద్ధం కావాలి అని సిబ్బందికి అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రస్తుతం పురపాలక సంఘం పరిధిలో ఎంతవరకు డీసిల్టేషన్ వర్క్ పూర్తి అయినదో కమిషనర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ వార్లను అడిగి తెలుసుకున్నారు ప్రధాన డ్రైనేజీ లను పూడిక తీయడానికి వీలైనంత త్వరగా కాంట్రాక్టులు పిలిచి మేజర్ డ్రైవింగ్ యొక్క డీజిల్ స్టేషన్ పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే డీసిల్టేషన్ చేసిన ప్రాంతాలలో మరో రెండు రోజుల్లో డీసిల్టేషన్ చేసిన వ్యర్ధాలను తొలగించవలసిందిగా ఆదేశాల ఇవ్వడం జరిగింది మరియు ప్రధాన డ్రైన్ లను కలుపుతూ ఉండే మధ్యస్థ డ్రైన్ లను పూడిక తీయడానికి పట్టణంలో అందుబాటులో ఉన్న యంత్రాలను ఉపయోగించవలసిందిగా సూచనలు చేయడం జరిగినది. పురపాలక సిబ్బంది అందరూ కూడా జులై 15 తేదీన టార్గెట్ గా పెట్టుకుని డీసెల్ టేషన్ వర్క్ పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది
