సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 58 వ వార్షిక మహోత్సవ లు ప్రారంభ సందర్భంగా నేటి గురువారం మధ్యాహ్నం 1:00 కి అమ్మవారికి విశేష పూజ అనంతరం, అర్చకుల వేదమంత్రాలు మేళతాళాలతో ఉత్సవ విగ్రహం తీసికొనివచ్చి హంస వాహనం ఫై ఎక్కించి గ్రామోత్సవం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాద్, ఆలయ సిబ్బంది, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు ప్రకృతి కూడా అమ్మవారి ని పురవీధులకు ఆహ్వానిస్తూ చిన్నపాటి చిరుజల్లులు మధ్య బ్యాండ్ వాయిద్యాలు తో కళాకారుల నృత్యాలతో బాణాసంచా కాల్పుల మధ్య శ్రీ మావుళ్ళమ్మవారి గ్రామోత్సవం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. గ్రామోత్సవం ముగింపుగా పెద్ద ఎత్తున వర్షం ప్రారంభమయింది. నేటి సాయంత్రం నుండి శ్రీ అమ్మవారి భారీ పందిరిలో వేదికపై సాంసృతిక నాటక ప్రదర్శనలు ప్రారంభించనున్నారు.