సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు నేతృత్వంలో ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణ శివారులోని పెద అమిరం లిబర్టీ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న స్థలంలో జరుగుతున్న మినీ మహనాడు ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ మినీ మహానాడు సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, టీడీపీ జోన్–2 ఇన్ చార్జి ప్రత్తిపాటి పుల్లారావులు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని అన్నారు. ఇక్కడ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వేలాదిగా పార్టీ క్యాడర్ తరలిరావాలని పిలుపు నిచ్చారు.
