సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: వైసిపి రాష్ట్ర సీనియర్ నాయకులు, రాజకీయాలలో అపర చాణుక్యుడుగా పేరొందిన భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు(82) నేడు, మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రజలందరి కుటుంబాలతో కలుపుగోరుగా అందరిని వరుసలు పెట్టి పిలిచే ఆయనకు ముగ్గురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు గలరు .మొదటి కుమారుడు గ్రంధి శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యే గా పని చేస్తున్నారు. రెండవ కుమారుడు గ్రంధి బాలాజీ ,మూడవ కుమారుడు గ్రంధి చల్లా రావు లు ఆక్వా రంగం లో ప్రముఖ పారిశ్రామిక వేత్త లు గా ఉన్నారు. సుదీర్ఘ కాలం జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దగా జిల్లా రాజకీయాలను శాసించారు. రాజకీయాలలోనే కాదు.. 4దశాబ్దాల క్రితమే ఇతర రాష్ట్రాలకు ఆక్వా వ్యాపార ఎగుమతులు చేసి ఇప్పటి ఆక్వా విప్లవానికి ఆద్యుడు అయిన గ్రంధి వెంకటేశ్వరరావు అంటే రాష్ట్రంలోనే తెలియని రాజకీయ నాయకులు ఉండరు. రాజకీయంగా అనేక పదవులను అలంకరించిన ఆయన ,దాతృత్వానికి మారుపేరుగా నిలిచారు. అనేక దేవాలయాలు నిర్మించారు. చల్లా రావు భోగి రాజు దంపతులకు 1941 మార్చి 24వ తేదీన వెంకటేశ్వరరావు జన్మించారు . 1989 నుండి 1997 వరకు భీమవరం టౌన్ ప్రెసిడెంట్ గా, 1988 నుండి 1995 వరకు రెండుసార్లు భీమవరం అర్బన్ బ్యాంక్ అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. 1991 నుండి 1995 వరకు రెండుసార్లు ఏపీ అర్బన్ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, 1992 నుండి 1995 వరకు పశ్చిమగోదావరి జిల్లా మార్కెటింగ్ సొసైటీ ట్రెజరర్ గా, 1995 నుండి 2000 వరకు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గా, ఏపీ కాంగ్రెస్ స్పెషల్ ఆహ్వానితులుగా, అదే మాదిరిగా రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ల కు అధ్యక్షులుగా పనిచేశారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత ఆప్తుడుగా ఉన్న వెంకటేశ్వరరావు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు నేటి ముఖ్యమంత్రి జగన్ వైసిపి ని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు .గ్రంధి వెంకటేశ్వరరావు ఇక లేరు అనే విషయాన్ని పార్టీ శ్రేణులు ,ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంటి పెద్ద ను కోల్పోయినట్లుగా బాధ తో విషాదం నిండుకొంది
