సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక ఎమ్మెల్యే మరియు, ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ నేడు, శనివారం ఉదయం భీమవరం లూథరన్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వేలాది మందికి ఇళ్ల స్థలాల రిజిస్టేషన్ పట్టాల పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. భీమవరం ప్రజలనే తన కుటుంబంగా ఎప్పుడు భావించానని .. 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు తన హాయంలోనే వందల ఎకరాల భూమిని సేకరించి ప్రజల కోసం, మంచినీటి అవసరాల కోసం వాటిని వినియోగించానన్నారు. మొదటగా తాడేరు రోడ్ లో 11 ఎకరాల భూమిని సేకరించి వందలాది ఇల్లు నిర్మించానన్నారు. తర్వాత అదే తాడేరు రోడ్లో 83ఎకరాలు సేకరించడం వల్ల నేడు 8వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మించుకో గలిగామన్నారు. భీమవరం మునిసిపల్ హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలో 120 ఎకరాలు భూమిని గతంలో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు సేకరించానని దానివల్ల ఆనాడు 60 ఎకరాలు భూమిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ నిర్మించడంతోపాటు ఇటీవల కాలంలో మరో 60 ..70 ఎకరాల్లో పేదల కు ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు అలాగే తాను పేద ప్రజలకు విద్య వైద్య సదుపాయాలు కల్పించడానికి బైపాస్ రోడ్ లో తమ కుటుంబ సభ్యులతో కలిసి కస్తూరిబా గాంధీ జూనియర్ కళాశాల కు స్థలాన్ని మరియు గొల్లవాని తిప్ప రోడ్ లో ఏరియా హాస్పిటల్ నిర్మాణానికి నాలుగు ఎకరాల భూమిని అందించామన్నారు అక్కడ హాస్పిటల్ నిర్మాణం అవుతుందన్నారు. తాను ప్రజల కోసం భూసేకరణ చేస్తే తనకు ముందు పని చేసిన ప్రజా ప్రతినిధి ( అంజిబాబు?) ప్రజా మేలుకోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుందని చెప్పి స్థానిక రైతులను మోసగించి రైతుల నుండి తన స్వంతానికి భూములను లాక్కున్నారని ఆరోపించారు.. చివరకు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా కక్ష తో తనను విమర్శించలేదని స్వయంగా చెప్పారన్నారు.. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, నరసాపురం వైసీపీ ఇంచార్జి గూడూరి ఉమాబాల,తోట బోగయ్య, జడ్పీటిసి..కాండ్రేగుల నరసింహారావు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు,మేడిద జాన్సన్ , పట్టణ వైసిపి నేతలు తదితరులు పాల్గొన్నారు
