సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రజల కోసం స్థానిక లూధరన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుర్గ ట్రేడ్ ఫెయిర్ వారి ‘ దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్’ పట్టణంలోని పెద్దలు పిన్నలు తో పాటు పట్టణ పరిసర గ్రామాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. గతంలో ఎన్ని ఎగ్జిబిషన్స్ వచ్చినప్పటికీ భారీ జయింట్ వీల్, టోర టోర,కొలంబస్ వంటి సాధారణ ఐటమ్స్ తో పాటు వాటికీ బిన్నంగా పెద్ద పెద్ద సిటీలో ఎగ్జిబిషన్ లలో ఉండే విధంగా ఎన్నో ద్రిల్స్ కలిగించే సునామి వంటి సరికొత్త ఐటమ్స్ ఏర్పాటు చేసారు. నిజంగా ఇటువంటి ఎగ్జిబిషన్లు అరుదుగా వస్తాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణగా దుబాయి నగరాన్ని తలపించేలా అనేక మంది శ్రామికులు వ్యయ ప్రయాసలకోర్చి వేసిన డమ్మీ సెట్స్, మరియు లండన్ బ్రిడ్జి ( దీనిపై ఎక్కి ఎగ్జిబిషన్ ను వీక్షించవచ్చు) భారీ ఆకర్షణగా చెప్పుకోవచ్చు.. ఇక దేశంలోని పలు ప్రాంతాల వారు నిర్వహిస్తున్న వస్త్ర దుకాణాల స్టాల్స్, ,తక్కువ ధరకు విభిన్న లేడీస్ ఫ్యాన్సీ , ఇతర హోమ్ మేడ్స్ అమ్మకాలు, భారీ చాట్ బండారు సెంటర్, ఇతర వైరైటీ తినుబండారాలు స్టాల్స్ పెద్దలకు చిన్నారులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని, ద్రిల్స్ తో మంచి అనుభూతిని కలిగించడం ఖాయం.. దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ నిర్వాహకులతో ఒకరైన భద్రయ్య మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. తాము తొలిసారిగా భీమవరంలో ప్రజలకు గతంలో చూడని విధంగా అనేక ద్రిల్స్ కలిగించే ఐటమ్స్ తో భారీ దుబాయ్ సిటీ ఎంట్రన్స్ తో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి భారీ స్థాయిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని ఇక్కడ మంచి ఆదరణ ఉన్నపటికీ, చాల రోజులుగా వర్షాలు అడ్డుకొన్న నేపథ్యంలో మరింతగా వీక్షకులు విశేషంగా హాజరు అయి మా కష్టం ఫలిస్తే భవిషత్తు లో మరింత భారీ స్థాయి ఎగ్జిబిషన్ ఏర్పాటు కు కృషి చేస్తామని అన్నారు. సుమారు మరో 3వారలు మాత్రమే ఎగ్జిబిషన్ నిర్వహించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *