సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ, పరిసర ప్రాంత ప్రజల ఆహ్లదం కోసం స్థానిక లూధరన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ‘ఉత్సవ్ మేళ’ ఎగ్జిబిషన్’ పట్టణంలోని పెద్దలు పిన్నలు తో పాటు పట్టణ పరిసర గ్రామాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. గతంలో ఎన్ని ఎగ్జిబిషన్స్ వచ్చినప్పటికీ తొలిసారిగా భారీ ‘అండర్ వాటర్ ఫిషింగ్ టర్నల్’ ఏర్పాటు చేసి భారీ గ్లాస్ టర్నల్ నీళ్ల లో రంగురంగు చేపల క్రింద నుండి మనం నడుచుకొంటూ వెళ్లే అద్భుత అనుభూతి ఆబాల గోపాలాన్ని విశేషంగా అలరిస్తుంది. ఇంకా ఎన్నో ద్రిల్స్ కలిగించే భారీ జెయింట్ వీల్, కొలంబస్, టొరాంటోర , డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డాన్స్ తదితర ఐటమ్స్ ఏర్పాటు చేసారు. ఇక దేశంలోని పలు ప్రాంతాల వారు నిర్వహిస్తున్న వస్త్ర దుకాణాల స్టాల్స్, బెంగాల్ ,లక్నో కాటన్ చీరలు, వైరిటి బెడ్ షీట్స్ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విభిన్న లేడీస్ ఫ్యాన్సీ , ఇతర హోమ్ మేడ్స్ అమ్మకాలు, భారీ చాట్ బండారు సెంటర్, ఇతర వైరైటీ తినుబండారాలు స్టాల్స్ పెద్దలకు చిన్నారులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని, ద్రిల్స్ తో మంచి అనుభూతిని కలిగించడం ఖాయం.. ఉత్సవ్ మేళ ఎగ్జిబిషన్ నిర్వాహకులతో ఒకరైన వెంకటరెడ్డి మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. తాము తొలిసారిగా భీమవరంలో ప్రజలకు గతంలో చూడని విధంగా అనేక ద్రిల్స్ కలిగించే ఐటమ్స్ తో పాటు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి భారీ స్థాయిలో తొలిసారి అండర్ వాటర్ ఫిషింగ్ టర్నల్ ఏర్పాటు చేశామని దానికి ప్రజలు నుండి మంచి స్వాందన వస్తుందని అన్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవ్ మేళ ఎగ్జిబిషన్ ఇప్పటికే 16 రోజులు పూర్తీ చేసుకొంది.
