సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు నరసాపురం డిఎస్పీ శ్రీ వీరాంజనేయ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో వన్ టౌన్ సీఐ కృష్ణ భగవాన్ మరియు టు టౌన్ సీఐ కృష్ణకుమార్ అధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో పోలీస్ అధికారులు సంక్రాంతి పండుగల నేపథ్యంలో కోడిపందాలకు, పేకాట, గుండాట వంటి అన్ని జూద క్రీడలకు దూరంగా ఉండాలని ప్రజలను చైతన్యం చేసే కార్యాక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 38వ వార్డు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్సై మూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి యొక్క ఉత్తర్వులు మేరకు జూద క్రీడలు నిర్వహించరాదని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఫ్లెక్సీలు ద్వార ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు జూద క్రీడలకు దూరంగా ఉండి ప్రజలందరూ సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అవగాహన కార్యక్రమం నిర్వహించినారు అలాగే ప్రజలకు సాంప్రదాయ క్రీడలు గేమ్స్ పట్ల మక్కువ చూపించాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *