సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ప్రధాని మోదీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణ ద్వారా పేద మధ్య తరగతి వారికి ఎంతో ఉపకరిస్తుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనేడు, ఆదివారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువులను వాడదాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేద్దాం అనే ప్రచార భేరి బ్రోచర్ ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. మనం వినియోగించే ప్రతి వస్తువు మన దేశంలో తయారైనవే వాడాలని,హ్యాండీ క్రాఫ్ట్ వాడితే చేతి వృత్తులను ప్రోత్సహించినట్లు అవుతుందని ఎందరికో ఉపాధి దొరుకుతుందని జిల్లాల్లో ఇప్పటికే ప్రచార బేరీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముందుగా మన నియోజకవర్గం లో ఇటువంటి ప్రచార అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మన టాక్స్ ఆదాయం మన దేశంలోనే ఉంటుందని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట పడుతుందన్నారు. కూటమి నాయకులు తెలుగు మహిళలు పాల్గొన్నారు.
