సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు, శుక్రవారం ఉదయం స్థానిక ప్రజలు, టిడిపి నాయకుల నుండి వినతి పత్రాలను నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్వీకరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. బియ్యం రేషన్ కార్డు కలిగిన కుటుంబ సభ్యులకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సహాయాన్ని ఎన్డీఏ కుటమీ ప్రభుత్వం అందజేస్తుందని ఆరోగ్యశ్రీలో లేని చికిత్సలకు వైద్య ఖర్చులు చెల్లించిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని ఈ అవకాశాన్ని నాయకులు నియోజవర్గ ప్రజలు సద్వినియోగం పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కృష్ణా బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ భీమవరం మండల టిడిపి అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఇందుకురి సుబ్రమణ్యరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *