సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే అంజిబాబు నేడు, శుక్రవారం భీమవరంలోని తన క్యాంప్ కార్యాలయంలో భీమవరం నియోజక వర్గ ప్రజల నుంచి అర్జీలను (PJRS) స్వీకరించారు. స్వయంగా అర్జిదారుల సమస్యలను తెలుసుకుని వారితో మాట్లాడారు. వీరవాసరం మండలం బొబ్బనపల్లి గ్రామంలో నాచు పట్టిన నీళ్లు వస్తున్నాయని, సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. పలువురు వారి సమస్యలను తెలియజేసి అర్జీలను అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి నెలలోని మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తామని, వారం రోజుల్లోనే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
