సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల పనితీరు మారాల్సిందేనని లేకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) హెచ్చరించారు. నేడు, సోమవారం ప్రభుత్వాస్పత్రిలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. మన భీమవరం ప్రభుత్వాసుపత్రిపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కువగా కేసులను, టెస్టులను బయటకు ప్రవేటువారికి రిఫర్ చేస్తున్నారని, ఇటువంటివి సహించలేమని ఇక్కడకు వచ్చిన ,రోగులకు , వైద్య సేవలు సక్రమంగా అందించాలన్నారు. లోపాలు ఇలాగే కొనసాగితే ఆకస్మిక తనిఖీలు చేస్తామని ఈసారి చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది సమన్వయంతో సేవాభావంతో పని చేయాలని, పేదలకు ప్రేమతో దయతో వైద్య సేవలు అందించాలన్నారు. ప్రతి నెల తనిఖీలు చేపట్టాలని డీఎంహెచ్ వో కు సూచించారు. కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, ఆసుపత్రి వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *