సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం ప్రభుత్వాసుపత్రికి అన్నపూర్ణమ్మ అన్నధాన సేవ ట్రస్ట్ అధ్యక్షులు తమిరి శరత్ సహకారంతో సుమారు రూ 40 వేలు విలువ కలిగిన ఏసీ ను అందించారు. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ఏసీ ను ప్రారంభించి దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయని, దాతల ద్వారా మరిన్ని సౌకర్యాలు కూడా రోగులకు అందుబాటులో ఉన్నాయని, పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు తమిరి శరత్ మాట్లాడుతూ.. మా ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రభుత్వాసుపత్రికి ఏసీ కావాలని కోరడంతో సుమారు రూ 40 వేలు విలువ కలిగిన ఏసీ ను అందించామన్నారు. ట్రస్ట్ సభ్యులు, కూటమి నాయకులు కార్యకర్తలు ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
