సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం నాగిడిపాలెం పంచాయతీ రెడ్డిచెరువు గ్రామంలో “గడపగడపకు.. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఇంకా ఏమైనా సమస్యలు వున్నాయా? అని అడుగుతూ, పర్యటించారు. తదుపరి నేటి సాయంత్రం, భీమవరంలోని తన క్యాంపు కార్యాలయం లో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డిసిహెచ్ఎస్ ఇంచార్జ్ ఎం వీరస్వామి, పలువురు వైద్యులుతో సమావేశం అయ్యారు. ఇటీవల వాతావరణ మార్పులతో ప్రజలు జ్వరాలు బారి పడుతున్నారని, రోగుల సంఖ్యా పెరుగుతుందని అయితే ఇటీవల తరుచు ప్రభుత్వ ఆసుపత్రి ఫై తన దృష్టికి వస్తున్నా ఫిర్యాదుల మేరకు ఇకపై రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా డాక్టర్లు, సిబ్బంది కృషి చేయాలని.. మరోసారి రోగుల నుండి ఫిర్యాదులు వస్తే మాత్రం సహించేది లేదని ,చర్యలు ఉంటాయని, డాక్టర్ తో పాటు సిబ్బంది అంతా రోగులపట్ల సేవాభావం తో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి కోసం అన్నిఆధునిక వసతులు కల్పించామని.. అయిన పారిశుద్యం కూడా కీలకమని ముఖ్యంగా ఆసుపత్రులలో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా త్రాగునీటి సరఫరా లో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *