సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఆధునాతన N C D మరియు క్యాన్సర్ స్కీనింగ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ..ఈ ఆధునిక వైద్య సదుపాయాలతో ఈ కొత్త స్కీనింగ్ ను ఏర్పాటు చెయ్యడం వల్ల మహిళలకు వచ్చు అనేక ప్రాణాంతక వ్యాధులను, కాన్సర్ ను ముందే గుర్తించి తగిన వైద్యం అందించడం ద్వారా వారి జీవితకాలం పెంచవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటికి ఆరోగ్యశ్రీ లో జగన్ సర్కార్ 3500 వ్యాధులను చేర్చి ఉచిత వైద్యం అందిస్తూ ప్రజలకు ఆరోగ్యం కోసం ఎంతో భరోసాగా నిలుస్తుందన్నారు. ఈ భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి కి జిల్లా వ్యాప్తంగా రోగుల సంఖ్యా బాగా పెరిగిందని దానితో ఆసుపత్రి ఫై స్టెయిర్ వేసిన సరిపోవడం లేదని మరో స్టెయిర్ వెయ్యడానికి టౌన్ ప్లానింగ్ అనుమతి లేని కారణంగా భీమవరంలో వందపడకల ఆసుపత్రి నిర్మాణానికి మొదటి విడతగా సీఎం జగన్ సర్కార్ 10 కోట్లు కేటాయించడం దానితో స్లాబుల వరకు నిర్మాణం పూర్తీ కావడంతో ఇటీవల నాబార్డ్ నిధులు 23 కోట్లు విడుదల చెయ్యడం తో దానిని శరవేగంగా పూర్తీ చేస్తామన్నారు.
