సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకొన్న నటి నిధీ అగర్వాల్ (Nidhi Agerwal) భీమవరంలో నిన్న సోమవారం జరిగిన ఓ ఈవెంట్‌కు అతిథిగా ఏపీ ప్రభుత్వ వాహనంలో హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ బోర్డు (Nidhi govt Vehicle) ఉన్న వాహనంలో ఆమె కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో టీవీ న్యూస్ ఛానెల్స్ లో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం విధులు నిర్వహించే అధికారులు, నాయకులు ప్రయాణించాల్సిన ప్రభుత్వ వాహనాలు లో ఓ సినీనటి ఎందుకు ప్రయాణించిందని? డెప్యూటీ సీఎం ప్రక్కన సినిమాలలో నటిస్తే గవర్నమెంట్ వాహనంలో త్రిప్పేస్తారా?పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి నిధీ తాజాగా వివరణ ఇచ్చారు. భీమవరంలో జరిగిన .. ఆ విషయంలో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ నిరాధారమైనవి. అది నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనమని తాను భావించానని తనకు ఏమి తెలియదని ఆమె తెలిపారు. ఎక్స్ వేదిక వివరణ ఇస్తూ ఓ లేఖ పోస్ట్ చేశారు.
