సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకం కింద ఆక్వా ఉత్పత్తుల ఎగు మతులను ప్రోత్సహించేందుకు, .. గోదావరి జిల్లాల తో పాటు కోస్తా ఆంధ్ర లో ఆక్వా రంగానికి ప్రయోజనకారిగా చేపలు, రొయ్యలు ఉత్పత్తుల రవాణాకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కిసాన్‌ రైలు నడపనుంది. దేశం మొత్తం మీద ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఏపీ నుంచి ముఖ్యంగా కోస్తా ప్రాంతం నుంచే 30 శాతం చేపలు, రొయ్యల ఎగుమతులు జరుగుతున్నందున ఈ ప్రత్యేక గూడ్సు రైలును తక్కువ రవాణా ఛార్జీలతో నడపాలని కేంద్రం నిర్ణయించినట్టు రైల్వే బోర్డు ఫ్రైట్‌ మార్కెటింగ్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ మిశ్రా జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీనిని ఒక పైలట్‌ ప్రాజెక్టుగా తొలి దశలో ఈ కిసాన్‌ రైలును విజయవాడ రైల్వే జంక్షన్‌తోపాటు దానికి దగ్గరలోని స్టేషన్ల నుంచి హౌరా, గౌహతి, సిల్‌బార్‌ సెక్టార్‌కువరకు ఈ రైలును నడుపుతారు. విజయవాడతోపాటు ఆక్వా వ్యవసాయ రాజధాని, భీమవరం, నెల్లూరు, మచిలీ పట్నం, గుడివాడ, నుంచి కూడా కిసాన్‌ రైలులో ఆయా ప్రాంతాల చేపలు, రొయ్యల ఎగుమతులు బట్టి రవాణాకు అవకాశం కల్పిస్తారు. ప్రత్యేకంగా ఈ రైలును ఏర్పాటు చేయాలంటే కనీసం 300 టన్నుల ఉత్పత్తులు అవసరం. ఒక్కో బోగీకి 26 టన్నుల చేపలను నింపే సామర్థ్యం ఉంటుంది. ఈ మేరకు రైల్వే శాఖకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కుంటే , సరుకు ఎక్కించే రోజున, ఆయా స్టేషన్ల నుంచి కిసాన్‌ రైలును ఎగుమతి చేసే రాష్ట్రానికి ఏర్పాటు చేస్తారు. రవాణా ఛార్జీలు కూడా చాలా తక్కువ. రోడ్డు రవాణా ఛార్జీల్లో మూడో వంతు ఉంటుంది. ఇంకేం ఆక్వా ఎగుమతులకు రైతులకు మంచి రోజులు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *