సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఉండి రోడ్డులోని కన్వేషన్ హాల్లో నేడు, బుధవారం భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ చార్టెడ్ ప్రజెంటేషన్, నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలి గా డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు, వైస్ ప్రెసిడెంట్లు బొండా లక్ష్మి రమణ, విఎస్ఎస్ లక్ష్మీదేవి, సెక్రటరీ డాక్టర్ చేకూరి ప్రీతి, ట్రెజరర్ కానగర్ల నాగమణి, కో ఆర్డినేటర్ వేగేశ్న సునంద, అడ్మనిస్టేటర్ ఇందుకూరి శిరీష, సర్వీస్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ లక్ష్మి మౌనిక, మార్కిటింగ్ చైర్ పర్సన్ వేగిరాజు ప్రవల్లిక దేవి, మెంబర్ షిప్ చైర్ పర్సన్ కాగిత ప్రియాంక లతోపాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ 316జి లయన్ ఎన్ వివిఎస్ పాపారావు నాయుడు,పూర్వ జిల్లా గవర్నర్, డా ఎం వి సూర్యనారాయణ రాజు లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బొండా రాంబాబు, మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి సేవలందిస్తోందని, వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, విపత్తుల సమయంలో ఆపదలో ఉన్న ప్రజలకు చేయూతనందించడం ద్వారా లయన్స్ సేవలు విశేషమైనవని అన్నారు. లయన్స్ క్లబ్ సమాజ సేవలో అగ్రభాగాన ఉందంటే క్లబ్ సభ్యుల సమష్టి సహకారమే అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *