సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ ప్రొప్రైటర్స్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశము అసోసియేషన్ అధ్యక్షులు బొండాడ రామమోహనరావు( రాంపండు) అధ్యక్షతన చాంబర్ భవనంలో జరిగినది. ఈ సమావేశంలో 2025-2027 సం.లకు అసోసియేషన్ నూతన కార్యవర్గమును ఎన్నుకోవడమైనది. అధ్యక్షులుగా శ్రీ బొండాడ రామమోహనరావు (రాంపండు) ,ఉపాధ్యక్షులుగా కొత్త శ్రీనివాస్, పరుచూరి వెంకట చిన్న నాగేశ్వరావు,కార్యదర్శిగా నల్లం రఘుబాబు సహాయ కార్యదర్శులుగా ఆర్ శ్రీనివాసరావు, గుండు సుమూర్తి మరియు కోశాధికారిగా గాదె వెంకట సురేష్ ఎన్నికయ్యారు. మరియు 12 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనారు. అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఈ సంఘము నుండి ఇర్రింకి నారాయణమూర్తిని ఎన్నిక చేయడమైనది.
