సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక అమ్మవారి జాతరలు గ్రామోత్సవాలు గ్రామ పట్టణ శాంతిని కోరుకుంటాయని, సంప్రదాయ బద్దంగా శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం బలుసుమూడిలోని శ్రీమావుళ్ళమ్మ జాతర మహోత్సవాన్ని శనివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. మూడేళ్లకు ఒక్కసారి అమ్మవారి జాతర మహోత్సవాన్ని వేద మంత్రాలతో మూడు రోజులపాటు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. అనంతరం డప్పుల వాయిద్యాలతో గారగల నృత్యాలతో అమ్మవారి జాతరను నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
