సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్ కాలేజ్ ప్రక్కన గ్రౌండ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీరామ్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు భీమవరం బాక్స్ క్రికెట్ లీగ్ పేరుతో జరగనున్న క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు…తదుపరి కొద్దీ సేపు యువ క్రీడాకారులతో కల్సి క్రికెట్ ఆడి, తాను యువకుడిగా మారిపోయి తనదయిన నైపుణ్యంతో చక్కటి షాట్స్ కొట్టడం, బౌలింగ్ చేసి తన ప్రతిభ ను చూపించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. నాకు చాల ఇష్టమైన ఆట.. క్రికెట్. క్రికెట్ గ్రౌండ్ లో దిగితే సిక్సర్లు కొట్టడంపై మక్కువ చూపేవాడిని, ఇక్కడ నిర్వాహకులు ఇంత పెద్ద స్థాయిలో 40 టీమ్ లతో పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు.
