సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం బి. వి రాజు కళాశాలలో పర్సనాలిటీ డెవలంట్ మరియు పోలీస్ శాఖలో ఉద్యోగ ఆవకాశాలకు గూర్చి నేటి సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విద్యార్థులకు ఆవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి కే డి. ప్రసాద్ కుమార్ విద్యార్థులకు వారి సందేహాలు తీరుస్తూ ఉత్తేజకరమైన ప్రసంగం ఇచ్చారు. వారికీ కాలేజీ నిర్వాహకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాలేజీ NSS యూనిట్స్ ఆధ్వర్యంలో నిర్వహించగా దాదాపు 200 పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఐ ఆర్ కె రాజు , వైస్ ప్రిన్సిపాల్ Ch. S. V. సత్యనారాయణ NSS అధికారులు మరియు ఉపాధ్యాయ NSS వాలంటీర్స్ పాల్గొన్నారు.
