సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బులియన్ అసోసియేషన్ 2025- 27 కుగాను నూతన కార్యవరాన్ని ఎన్నుకున్నారు. శనివారం భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులుగా కోట్ల నాని ఉపాధ్యక్షులు కారుమూరి కిరణ్, పున్నం శ్రీనివాసరావు, కార్యదర్శి వబిలిశెట్టి పార్థసారథి, సహాయ కార్యదర్శులు కనగర్ల విజయ రామకృష్ణ, బొండాడ నాగభూషణం, కోశాధికారి బొండా రామకృష్ణరావు (రాంబాబు)లు ఎన్నికైనట్లు తాత్కాలిక అధ్యక్షులు వబిలిశెట్టి పట్టాభిరామయ్య తెలిపారు. ఎన్నికైన సభ్యులను మార్నింగ్ కాఫీ క్లబ్, చైతన్య భారతి సభ్యులు, పలువురు అభినందించారు.
