సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్రికెట్ ప్రియుల కోసం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపిఎల్) భీమవరం బుల్స్ లోగో, జెర్సీ (డ్రెస్ కోడ్) ను భీమవరంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ప్రఖ్యాత భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భీమవరం బుల్స్ టీం విజయం సాధించి కప్పుతో భీమవరం రావాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. తెలుగు రాష్ట్రాలలో ఐకాన్ పట్టణం భీమవరం పేరు పెట్టినందుకు భీమవరం ఖ్యాతి నిలిచేలా క్రీడాకారులు కూడా కష్టపడి ఆడాలని కోరారు. మన ప్రాంత క్రీడా అభిమానులందరూ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ఏపిఎల్ భీమవరం బుల్స్ టీం కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ లీగ్స్ తో ఆంధ్రప్రదేశ్ ఉన్న క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని, అందువల్లే దీనిని ఏపీలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈనెల 8 నుండి 23 వరకు విశాఖపట్నంలో 7 టీమ్స్ తో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయని అన్నారు. అనంతరం కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డిని, క్రీడాకారులు మునిష్ వర్మ, హేమంత్ కుమార్ లను సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నేతలు , SRKR కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు
