సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలో యూనియన్ బ్యాంకు మేనేజర్, మరో ఇద్దరు ఉద్యోగులపై భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని రురల్ ఎస్సై మోహన్ రావు తెలిపారు. కేసు వివరాలు .. కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన కొల్లి ముత్యాలరావు, ఆయన భార్యకు గొల్లవానితిప్ప లోని యూనియన్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. నాలుగు నెలలు క్రితం వరకు 10 లక్షల డిపాజిట్ కలిగి ఉన్న ముత్యాలరావు తన భార్య ఖాతా లోంచి రూ.7 లక్షలు, మరోసారి రూ.లక్షా వెయ్యి తీసి తన ఖాతాలో డిపాజిట్ చేశారు. దానికి బ్యాంకులో రసీదులు ఇచ్చారు. అయితే ఇటీవల తన ఖాతా చెక్ చేసుకోగా సదరు నగదుతోపాటు తన ఖాతాలో వేసిన మరో రూ.10 లక్షలతో కలిపి మొత్తం కలపి రూ.18 లక్షల వెయ్యి లేవని ముత్యాలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
