సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బారతీయ సినీ పరిశ్రమలో ‘భీమవరం బ్రాండ్స్’ కు విలువ అందరికి తెలిసిందే.. భీమవరం వాసి, స్థానిక డి ఎన్ ఆర్ కళాశాలలో చదువుకొని తదుపరి గత 2 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కామిడి విలన్ గా, ఆర్య, అమ్మానాన్న తమిళ అమ్మాయి, బాహుబలి, పోకిరి, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలలో ఎన్నో కీలక పాత్రలలో మెప్పిస్తున్న సుబ్బరాజు ఎట్టకేలకు ఇటీవల 47 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాడు. మరో భీమవరం బ్రాండ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన సినిమాలలో సుబ్బరాజు కు ఎటువంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇస్తారో అందరికి తెలిసిందే.. తాజాగా తన కుటుంబ సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొన్నా సుబ్బరాజు పెళ్లి ఫోటోలు లీక్ అయి వైరల్ గా మారాయి. ఫై చిత్రంలో సుబ్బరాజు నూతన దంపతులను చూడవచ్చు.
