సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా భీమవరం బ్రాండ్ శ్రీ విష్ణు హీరోగా గత నెలలో రిలీజ్ మంచి విజయం సాధించిన చిత్రం సింగిల్ (#Single). వెన్నెల కిశోర్ , ఇవానా, కేతిక శర్మ జంటగా నటించిన ఈ చిత్రం యూత్ లో ఆదరణను దక్కించుకుంది. కార్తీక్ రాజు ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం చేశాడు. ఈ సినిమా కు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo IN) లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణ భారత భాషల్లోనూ అందుబాటులో ఉంది. 2న్నర గంటలపాటు మంచి కామెడీ, సరదా, సరదాగా సాగిపోయే సినిమా చూడాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సింగిల్ (#Single) సినిమాను మిస్ చేసుకోవద్దు
