సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సామజవర గమన’ సూపర్ హిట్ తరువాత తర్వాత ‘ఓమ్ భీమ్ బుష్’ , ‘స్వాగ్’ (Swag) వంటి ఓటిటి హిట్ సినిమాలు తో మంచి పామ్ లో ఉన్న భీమవరం వెటకారం బాగావంటబట్టిన హీరో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన సినిమా ‘#సింగిల్’. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా, కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ ఏమిటంటే… వయస్సు వచ్చిన నిరాశతో పెళ్లి కాకుండా సింగిల్ గా ఉండే విజయ్ (శ్రీవిష్ణు) జీవితంలోకి అనుకోకుండా ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ప్రవేశిస్తారు. ఒకరు అతను ప్రేమించిన పూర్వ (కేతిక శర్మ) కాగా, మరొకరు తనని ప్రేమించిన హరిణి (ఇవానా). బ్యాంక్ ఎంప్లాయ్ అయిన విజయ్… కార్ షోరూమ్ లో సేల్స్ గర్ల్ అయిన పూర్వ మధ్య సాగే ప్రేమకథ లో మరో హీరోయిన్ ప్రవేశిస్తుంది. విజయ్ వీరిద్దరిలో ఎవరిని ఎన్నుకొన్నాడు.? ఒకరిని నమ్మి వేరొకరిని చేజార్చుకుని, తిరిగి వెనక్కి చూసుకుంటే ఏం కోల్పోయాడు? అనేదే కధ . సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఓ నవ్వుల విందులా సాగిపోయింది. అయితే ఎక్కడ కధలో ప్రేక్షకులు లీనం అయ్యే సన్నివేశాలు లేవు. శ్రీ విష్ణు పక్కనే ‘వెన్నెల’ కిశోర్ పంచ్ డైలాగ్స్ పోటాపోటీగా పేలాయి.ఇక సెకండ్ ఆఫ్ లో హరిణి నేపథ్యాన్ని చెబుతూ రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏమంత ఆకట్టుకోలేకపోయింది. బ్యాంక్ మేనేజర్ గా నటించిన వీటీవీ గణేశ్ కల్పలత, ప్రభాస్ శ్రీను, కిర్రాక్ సీత, శత్రు ఇందులో ఇతర పాత్రలను పోషించారు. క్లయిమాక్స్ లో నార్నే నితిన్, రెబ్బామాస్టర్ రేవంత్ (బుల్లి రాజు) అతిథి పాత్రల్లో మెరిశారు విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది ట్రైలర్ రిలీజ్ కాగానే ఎదురైన కాంట్రవర్శీతో కొన్ని డైలాగ్స్ ను తొలగించారు. శ్రీ విష్ణు ‘స్వాగ్’ లాంటి భారీ కధ తో గత అనుభవాల ఎక్కడా,సెంటిమెంట్ లాజికి లకు పోకుండా థియేటర్లో పంచ్ డైలాగ్స్ యూత్ వినోదం ప్రధానంగా టార్గెట్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *