సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం విస్సాకోడేరు ప్రాజెక్టు పరిధిలోని యనమదుర్రు,దెయ్యాలతిప్ప,కోమటితిప్ప అంగన్ వాడీ సెంటర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్ వాడీ సెంటర్ల యందు హాజరు పట్టీని పరిశీలించి అంగన్ వాడీ సెంటర్లో చిన్నారులకు‌ అందస్తున్న విద్య మరియు గర్భిణీ లకు,బాలింతలకు పాలు,గుడ్లు సంపూర్ణ పోషణ వంటి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారా.?లేదా?తదితర సౌకర్యాలపై పిల్లలను అధికారులును అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన సీఎం జగన్ మహిళలు కోసం అంగన్ వాడీ సెంటర్ల ద్వారా పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా పిల్లలకు గర్భిణీ లకు,బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తూ‌ మహిళా సాధికారత లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారు.కావున అంగన్ వాడీ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడా బాధ్యతగా పనిచేస్తూ గర్భిణీలు,బాలింతలు చిన్నపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *