సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరంలో కూటమి మద్దతు తో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు నేడు, గురువారం భీమవరం మండలంలో గొప్పవానితిప్ప, యనమదుర్రు దిరుసుమర్రు గ్రామాలలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్ధించారు. గ్రామాలలో మంచినీటి కుళాయి ని ప్రతి గృహానికి అందేలా కృషి చేస్తానని, అవినీతి లేని అభివృద్ధిని సాధిస్తానని అందరికి అందుబాటులో ఉంటానని ఆయన ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు పలువురు ఆయనతో పాటు ఉత్సహంగా పర్యటించారు. అంజిబాబు విజయం కోసం .. నటుడు పృద్వి రాజ్ తో పాటు పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ సినిమాలోని పలువురు నటుల బృందం భీమవరంలో పర్యటిస్తుంది.నేటి సాయంత్రం భీమవరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో కొటికలపూడి చినబాబు మరియు పులపర్తి అంజిబాబు కుమారుడు ప్రశాంత్ , చంద్రశేఖర్, సమక్షంలో చిత్రకారులు, సంఘం అధ్యక్షుడు పరిమి రామకృష్ణ, మరియు పలువురు పెయింటింగ్ కార్మికులు జనసేన లో చేరినట్లు ప్రకటించారు. వారికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
