సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన తోపాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలం దొంగపిండి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే అంజిబాబు స్వయంగా పరిశీలించారు. చిన్నారులను పేరులను అడిగి తెలుసుకుని మెనూ ప్రకారం ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థులలో పౌష్టికాహారలోపం లేకుండా ఉండేలా మధ్యాహ్న భోజనంలో ప్రతీ రోజు పౌష్టికాహారంతో ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, వంట సరుకుల నాణ్యత, నిర్దేశించిన మెనూను ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తన పరిశీలనలో తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తుందుర్రు , యనమదురు గ్రామాల లో ఎమ్మెల్యే పర్యటనలో టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, సర్పంచ్ రేవతి, కోళ్ల నాగేశ్వర్రావు మోకా శ్రీనివాస్, రేవు వెంకన్న, చెనమల్ల చంద్రశేఖర్, గ్రామ నాయకులుకూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *