సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం బేతపూడి గ్రామపంచాయతీ పరిధిలో యమునేపల్లి వద్ద రూ 12 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి, కరుకువాడ, బేతపూడి గ్రామంలో మరో 12 లక్షలతో నిర్మించే అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమవరం రూరల్ గ్రామాలలో మెయిన్ రహదారులతో పాటుగా అంతర్గత రోడ్లు కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. గ్రామాలలో అంతర్గత రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ సౌకర్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. గ్రామాలలో అంతర్గత రోడ్లు లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని, అందుకే ప్రతి గ్రామంలో కూడా అంతర్గత రోడ్లు ఎక్కడ ఎక్కడ నిర్మించాలనే దానిపై రూట్ మ్యాప్ కూడా తయారు చేయడం జరిగిందని అన్నారు. ఇక గ్రామాలలో ప్రజలకు పూర్తిస్థాయిలో స్వచ్ఛమైన నీటిని అందించేందుకు జల జీవన్ మిషన్ పథకంలో మొదటి విడత రూ 20 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని, ఈ పథకంలో ప్రతి ఇంటికి కూడా కొళాయి కనెక్షన్ ఉండేవిధంగా పైపులైను ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
