సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం తాడేరు గ్రామంలోని రైతు బజార్ భరోసా కేంద్రంలో నేడు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువుల దాణా సబ్సిడీపై సరఫరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. రాయితీపై పశు దాణా రైతులకు అందించి వారిలో ధీమా కలిగిస్తున్నామని, పశువుల ఆరోగ్యం, ఉత్పత్తిని కాపాడటానికి రాయితీపై పశువులకు నాణ్యమైన సమీకృత దాణా సరఫరా చేస్తున్నామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 50 శాతం రాయితీ అందిస్తున్నామని, 50 కిలోల దాణా సంచి రూ 1110 అని, 50 శాతం రాయితీతో రూ 555 లుకే రైతులు చెల్లించాలన్నారు. ప్రస్తుతం భీమవరం మండలంలో 1000 మంది రైతులకు ఈ రాయితీని అందిస్తున్నారని, మొదటి విడతగా 250 మందికి ఇలా నాలుగు విడతలుగా 1000 మందికి పశువుల దాణా సబ్సిడీపై సరఫరా చేస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రంలోనూ, పశు వైద్యాశాలలో గాని సంప్రదించవచ్చునని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *