సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం కొత్త పూసలమర్రు గ్రామం వద్ద కోటిమొగ దొంగపిండి కాలువ పూడిక తీత పనులను భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు.ఈసందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ .. గత వైసిపి ప్రభుత్వ హయాంలో పంట నీరు మురుగునీరు కాలువల పూడికతీత పనులను చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కోటిమొగ కాలువ పూడికతో ఉన్న పరిసర ప్రాంతాల రైతులు స్వచ్ఛందంగా పూడిక తీత పనులను నిర్వహిస్తూ ప్రక్షాళన చేయడం సంతోషకరమని 4 వందల యకరాల వ్యవసాయ భూములకు మేలు జరుగుతుందని స్థానిక రైతులను లోసరి గుట్లపాడు నీటి సంఘ కమిటీ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమం లో నీటి సంఘ చైర్మన్ కొల్లాటి వరలక్ష్మి గోవిందరాజు ,లోసరి గోట్లపాడు సహకార బ్యాంక్ అధ్యక్షుడు బొమ్మిడి మధుసూదన రావు, ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ భీమవరం మండల టిడిపి అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి నీటి సంఘ వైస్ చైర్మన్ కొప్పర్తి సత్యనారాయణ ఎంపీటీసీ తిరుమల తులసిరావు రైతు సంఘం నాయకులు ముదుండి వెంకటరామరాజు మంతెన రామరాజు కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *