సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలో బేతపూడి, తుందుర్రులోను వీరవాసరం మండలం మత్స్యపూరి గ్రామంలో నేడు, బుధవారం సిసి రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ రాష్ట్ర నేత, మెంటే పార్ధ సారధి, సంయుక్తంగా ప్రారంభించారు. బేతపూడి గ్రామంలో రూ 20 లక్షలు, తుందుర్రు గ్రామంలో రూ 12 లక్షలు, మత్స్యపూరి గ్రామంలో రూ 37 లక్షలు మొత్తం 13 సిసి రోడ్లను రూ 69 లక్షలతో ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. గ్రామాలకు పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అన్ని గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటిపడిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.
