సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ టిడిపి పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మరియు మాజీ మంత్రి, ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్, పీతల సుజాత ఎన్డీఏ కుటమీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈసందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్డీఏ కుటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యవసాయ అభివృద్దె లక్ష్యంగా వ్యవసాయదారులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు సేవలను అందిస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. భీమవరం మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి కోళ్ళ సీతారాం కుటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలను సబ్సిడీలను రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో కుటమీ నాయకులు ఏపీ కృష్ణా బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంట త్రిమూర్తులు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య కుటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
