సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం మండలంలో కోటి 50 లక్షల 30 వేలతో నిర్మించిన పలు అభివృద్ధి నిర్మాణాలను ప్రారంభించారు. ముందుగా గొల్లవాని తిప్ప గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 21 లక్షల 90 వేల రూపాయలతో గొల్లవానితిప్ప మెయిన్ రోడ్డు నుండి 18 ఎకరాల కాలనీ వరకు నిర్మాణం చేసిన జి.ఎస్.బి రోడ్డును ప్రారంభించారు. తదుపరి 8 లక్షల రూపాయలతో పంట కాలువ బ్రిడ్జి నుండి చెన్ను నరసింహారావు ఇంటి వరకు నిర్మాణం చేసిన జిఎస్ బి రోడ్డును ప్రారంభించారు. తదుపరి గూట్లపాడు గ్రామంలో21 లక్ష 80 వేల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని,30 లక్షల రూపాయలతో గ్రామంలో నిర్మాణం చేసిన అంతర్గత సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. దొంగ పిండి గ్రామంలో 43 లక్షల 60 వేల రూపాయలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. సీఎం జగన్ సహకారంతోనే భీమవరం నియోజక ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అందించగలుగు తున్నానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *