సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం కొమరాడకు చెందిన పలువురు జనసేన యువకులు అభిమానులు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. టీడీపీ పల్లకి మోయడానికి జనసేన పుట్టింది అని వైసీపీ నాయకులూ విమర్శిస్తుంటే.. గతంలో తాము నమ్మలేదని 10 ఏళ్లుగా పవన్ విధానాలతో విసిగి పోయామని ఆఖరికి గత 4 న్నర ఏళ్లుగా టీడీపీ పార్టీకి , రాజకీయాలకు ప్రజలకు దూరంగా ఉన్న అంజిబాబు ను తీసికొనివచ్చి జనసేన టికెట్ ఇవ్వడంతో తమ ఆత్మాభిమానం దెబ్బతిందని , అసలు అభివృద్ధి అంటే ఏమిటో, ప్రజా సంక్షేమం అంటే ఎలా ఉంటుందో ? భీమవరం మండలంలోని గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసి చూపించారని, కిలో మీటర్లు మేర కోట్ల రూపాయల ఖర్చుతో రోడ్డులు వేయించారని, పంటకాలువలు బాగుచేయించారని, స్వంత భూమి 4 ఎకరాలు ఇచ్చి భీమవరం ఏరియా ఆసుపత్రి నిర్మిస్తున్నారని, దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడేరు వంతెన ను 2 కోట్ల పైగా ఖర్చు తో పునర్ నిర్మించి భీమవరం మండల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు చేసారని అందుకే ఈసారి ఎన్నికలలో ఆయనకు మద్దతు పలుకుతున్నట్లు వారు తెలిపారు. ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ వారికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. నేడు, శుక్రవారం పట్టణంలో 7,8,9,10 వార్డులలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *