సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేసిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నేడు, శనివారం భీమవరం రూరల్ మండలం దిరుసుమర్రు, రామాయణపురం,దెయ్యాలతిప్ప గ్రామాలలో 60 లక్షల రూపాయలతో నిర్మించే 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని, దిరుసుమర్రు లో సుమారు 7 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి సిసి రోడ్ వేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని, రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యా
యని పేర్కొన్నారు. మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరి చిరంజీవి రాజు, జనసేన పార్టీ మోకా శ్రీనివాస్ ,టీడీపీ పార్టీ కౌరు పృద్వి శంకర్, కె.వెంకన్న బాబు, గవర రాజబాబు, మైగాపుల గంగారాం,నాగిడి తాతాజీ బీజేపీ నేత రాట్నాల సత్యనారాయణ, బొడ్డు మోహన్,
పులపర్తి ఆంజనేయులు ,చిన్నమ్మ నాయుడు, విజ్జురోతు రాఘవులు, ,నాగిడిపాలెం సర్పంచ్ శ్రీను, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
