సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మండలం కొమరాడ గ్రామంలోని సచివాలయ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై పలువురు యువకులు దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత బుధవారం సాయం త్రం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా పిర్యాదు చేసారు. ఇక విషయంలోకి వెళ్ళితే..కొమరాడ సచివాలయం సమీపంలో చెత్త వేస్తున్నారని తమ ఫై పిర్యాదు చేసారని ఆగ్రహంతో స్థానికులైన అయిదుగురు యువకులు మద్యం మత్తులో సచివాలయం పై దాడి చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వీఆర్వో గూడపాటి పెంటయ్య పై దౌర్జన్యం చేసి చెయ్యి చేసుకొన్నారు, టేబుల్స్ ఫై కంప్యూటర్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా ఉద్యోగులు అడ్డుకున్నారు. సచివాలయం బయట వీఆర్వో స్కూటర్ను పాడుచేశారు. ఆ దృశ్యా లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తనపై దాడి చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారంటూ వీఆర్వో ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకులపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధం కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *