సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, దెయ్యలతిప్ప గ్రామాల్లో పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. యనమదుర్రు గ్రామంలో రూ 9 లక్షలు, దిరుసుమర్రు గ్రామంలో రూ కోటి 20 లక్షలు, దెయ్యలతిప్ప గ్రామంలో రూ 25 లక్షల నిధులతో సీసీ రోడ్లను ప్రారంభించారు. అన్ని గ్రామాల్లోని సీసీ రోడ్లనే వేయిస్తామని, బీటీ రోడ్లు వద్దని కూడా ఇటీవలే అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయలతో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అని, సూపర్ సిక్స్ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని అన్నారు. వచ్చేనెలలో తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తున్నామని, పింఛన్లు రూ 4 వేలు చేసి ఒకటో తేదీన అందజేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో గ్రామా పెద్దలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
